logo

ఆట..అటకెక్కింది

2024 వేసవి క్రీడా శిబిరాలు ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ శిబిరాలను నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 25 క్రీడాంశాల్లో 25 ప్రాంతాల్లో నిర్వహించాల్సి ఉండగా, కర్నూలు నగరానికే పరిమితం చేశారు.

Published : 27 May 2024 03:07 IST

నిధులు మంజూరు చేయని శాప్‌
ఇళ్లకే పరిమితమైన చిన్నారులు  
న్యూస్‌టుడే, కర్నూలు క్రీడలు (బి.క్యాంపు)

2024 వేసవి క్రీడా శిబిరాలు ఎన్నికల నేపథ్యంలో ఆలస్యమైన సంగతి తెలిసిందే. ఈ శిబిరాలను నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో 25 క్రీడాంశాల్లో 25 ప్రాంతాల్లో నిర్వహించాల్సి ఉండగా, కర్నూలు నగరానికే పరిమితం చేశారు. ఒక్కో శిబిరానికి రూ.10 వేల చొప్పన కేటాయించారు. ఏటా నగరంతోపాటు గ్రామీణ వేసవి శిబిరాలకు శాప్‌ నిధులు మంజూరు చేస్తుంది. ఈ నిధులు రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ మంజూరు చేయలేదు.

మ్మడి కర్నూలు, నంద్యాల, ఆదోని ప్రాంతాలతోపాటు మండల కేంద్రాలోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదానాలు వేదికగా వేసవి క్రీడా శిబిరాల నిర్వహణ జరిగేది. 45 క్రీడాంశాల్లో ఉమ్మడి జిల్లాలో 100 ప్రాంతాల్లో వేసవి శిబిరాలు జరిగేవి. ఒక్కో శిబిరానికి రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ రూ.10 వేలు ఇస్తోంది. ఈ నిధులతో ప్రారంభోత్సవ బ్యానర్లు, క్రీడా కిట్లు, ముగింపు సమయంలో క్రీడా పోటీలు నిర్వహించి పతకాలకు వినియోగించేవారు. ఈ డబ్బులు సరిపోకపోతే.. దాతల నుంచి నిధులను సేకరించి శిబిరాలను వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా సంఘాలు, గ్రామపెద్దలు ముగించేవారు.

గతంలో పండగ వాతావరణమే.. 

నెల రోజులపాటు సాగే శిబిరంలో చిన్నారులకు తేలికపాటి వ్యామాయం, శారీరక సామర్థ్యం కోసం కసరత్తులు, సంబందిత క్రీడల్లో నైపుణ్యం సాధించే విధంగా శిక్షణ సాగేది. ఈ శిక్షణ సీనియర్‌ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు సమక్షంలో నిర్వహించేవారు. ఒక్కో శిబిరానికి 40 నుంచి 50 మంది క్రీడాకారులతో పండగ వాతావరణాన్ని తలపించేది. చిన్నారుల ఉత్సాహం చూసిన గ్రామపెద్దలు, దాతలు ముందుకు వచ్చి శిక్షణ పొందిన చిన్నారులకు పౌష్టికాహారం అందించేవారు. ప్రస్తుతం వేసవి శిబిరాలు లేకపోవడంతో గ్రామీణ చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారు. 

నిధులు రాకపోవడంతో.. 

ఎన్నికల నేపథ్యంలో వేసవి శిబిరాల నిర్వహణ ఆలస్యమైంది. 2024 వేసవి శిబిరాలకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ నిధులు మంజూరు చేయలేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి వేసవి శిబిరాల నిర్వహణ అటకెక్కింది. చాలా మంది చిన్నారులు శిబిరాలు లేక ఇళ్ల వద్దనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.  

ప్రైవేటు అకాడమీల్లో... 

నంద్యాల, ఆదోని, ఆళ్లగడ్డ నియోజవర్గాలతోపాటు మండల కేంద్రాల్లో పలు ప్రైవేటు క్రీడా అకాడమీలు వెలిశాయి. ఇందులో వ్యాయామ ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారు. ఈసారి ప్రభుత్వ శిబిరాలు లేకపోవడంతో కొంత మంది చిన్నారులు ప్రైవేటు అకాడమీలకు వెళ్తున్నారు. కొన్ని అకాడమీలు రూ.500 నుంచి రూ.1000 వరకు రుసుము వసూలు చేస్తూ చిన్నారులకు ఆసక్తి ఉన్న క్రీడల్లో తర్ఫీదునిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు