logo

గోనెగండ్లలో గాలివాన బీభత్సం

మండలంలో శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సానికి విద్యుత్‌ తీగలు, చెట్లు నేలకొరిగాయి

Published : 25 May 2024 12:12 IST

గోనెగండ్ల: మండలంలో శుక్రవారం రాత్రి గాలివాన బీభత్సానికి విద్యుత్‌ తీగలు, చెట్లు నేలకొరిగాయి. గోనెగండ్ల లో 42.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  తీగలు తెగి విద్యుత్ స్తంభాలు ప్రధాన రహదారిపై అడ్డంగా పడిపోయాయి. దీంతో  మండలంలో  తెర్నెకల్ నుంచి గంజహల్లి వైపునకు గోనెగండ్ల మీదుగా ఎమ్మిగనూరుకు వెళ్లాల్సిన ఆర్టీసీ  బస్సు రాత్రంతా రోడ్డుపైన నిలిచిపోయింది. 

రహదారిపై  కూలిన చెట్లు

మండలంలోని పేరవాడి, వేముగోడు, పుట్టపాశము, తిప్పనూరు, పెద్ద నెలటూరు, గోనెగండ్ల గ్రామాల్లో రహదారులపై శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి  చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో గ్రామాల్లో రాకపోకలు అంతరాయం ఏర్పడింది. గోనెగండ్ల -గంజిహళ్లి రోడ్డుపై  రెండు చోట్ల పెద్ద చెట్లు రహదారిపై పడి పోయాయి. గోనెగండ్ల ప్రభుత్వ వైద్యశాలలో విద్యుత్ నియంత్రిక, పొలాల్లోని విద్యుత్ నియంత్రికలు గాలివానకు కూలి పడిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని