ఆ 5 తాగించండి
‘ఆ అయిదు’ బ్రాండ్ల విక్రయాలు పెంచాలంటూ ఉన్నత స్థాయి నుంచి వస్తున్న ఆదేశాలు మద్య నిషేధ, అబ్కారీ శాఖ అధికారులను ఆందోళన కలిగిస్తోంది.
మద్యం విక్రయాలు పెంచాలని ఒత్తిడి
కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : ‘ఆ అయిదు’ బ్రాండ్ల విక్రయాలు పెంచాలంటూ ఉన్నత స్థాయి నుంచి వస్తున్న ఆదేశాలు మద్య నిషేధ, అబ్కారీ శాఖ అధికారులను ఆందోళన కలిగిస్తోంది. ‘‘ ఇటీవల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి.. వాటిపై మందుబాబులు విముఖత చూపుతున్నారు.. ఏం చేయాలో అర్థం కావడం లేదని ’’ ఓ అధికారి వాపోయారు. ఆ అయిదు బ్రాండ్లు అధికార పార్టీ నేతలకు చెందిన కంపెనీల నుంచి వెలువడుతున్నాయి. వాటి విక్రయాలు పెంచడం సిబ్బందికి తలనొప్పిగా మారింది. మద్యం దుకాణాలు, బార్ల నిర్వాహకులకు బలవంతంగా కట్టబెడుతున్నారు. వాటి విక్రయాలు పెంచడం కోసమే సెబ్ అధికారులు పల్లెల్లో గొలుసు దుకాణాలపై దాడులు చేయటం లేదన్న ప్రచారం ఉంది.
పది నెలల్లో రూ.1293 కోట్లు
ఉమ్మడి జిల్లాలో 162 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 49 బార్లు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబరు వరకు రూ.1293.98 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ లెక్కన చూస్తే నెలకు రూ.129 కోట్లపైనే విక్రయాలు జరిపారు. నిత్యం మందుబాబులు రూ.4.3 కోట్ల మద్యం తాగుతున్నారు. 2021లో రూ.1,100 కోట్ల అమ్మకాలు సాగగా.. ఈ ఏడాది అక్టోబరు నాటికే అది దాదాపు రు.1,300 కోట్లకు చేరడం గమనార్హం. నవంబరు, డిసెంబరు నెలలు పూర్తయితే విక్రయాలు దాదాపు రూ.1,600 కోట్లకు చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
అధికారుల ఆపసోపాలు
ఉమ్మడి జిల్లాలో మద్యం విక్రయాలు పెంచేందుకు మద్య నిషేధ, అబ్కారీ శాఖ అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారిన నేపథ్యంలో.. మద్యం పాత్ర క్రియాశీలకంగా మారింది. ఉమ్మడి జిల్లాలో నిత్యం రూ.4 కోట్లకుపైగా విలువైన మద్యం తాగిస్తున్నా.. ఇంకనూ విక్రయాలు పెంచాలనే ఒత్తిడి మద్య నిషేధ, అబ్కారీ శాఖపై ఉంది. ఆ అయిదు బ్రాండ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుపతి-సికింద్రాబాద్ మార్గంలో వందేభారత్.. 8న ప్రారంభించే అవకాశం
-
Crime News
చిలుక వాంగ్మూలంతో.. హత్యకేసు నిందితులకు జీవితఖైదు
-
India News
వయనాడ్ సీటు ఖాళీ.. ప్రకటించిన లోక్సభ సచివాలయం
-
Politics News
‘షాపూర్జీ పల్లోంజీ నుంచి.. రూ.143 కోట్లు వసూలు చేసిన చంద్రబాబు’
-
Sports News
కోహ్లి దంపతుల ‘సేవ’.. కొత్త ఎన్జీవోకు శ్రీకారం
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?