logo

ఐక్య పోరాటాలతోనే విజయం

ఐక్య పోరాటాలతోనే విజయం సాధ్యమవుతుందని కేరళ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్‌ అన్నారు.

Published : 29 Nov 2022 02:19 IST

మాట్లాడుతున్న కేరళ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్‌

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: ఐక్య పోరాటాలతోనే విజయం సాధ్యమవుతుందని కేరళ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, సంక్షేమ శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్‌ అన్నారు. కేవీపీఎస్‌ 4వ రాష్ట్ర మహాసభలు జిల్లా కార్యదర్శి ఆనంద్‌బాబు అధ్యక్షతన కర్నూలు నగరంలో సోమవారం ప్రారంభమయ్యాయి. ముందుగా పాత నగరంలోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయనతోపాటు కేవీపీఎస్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి జాన్‌వెస్లీ, శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. కుల వ్యవస్థ బందీలుగా ఉండిపోయి ఉపాధిలోనూ, చదువులోనూ మనకు రావాల్సిన వాటా రాలేదన్నారు. కేవీపీఎస్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి జాన్‌వెస్లీ , డీఎస్‌ఎంఎం జాతీయ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ కుల నిర్మూలన జరిగితేనే సామాజిక రుగ్మతలు పోతాయన్నారు. కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి మాట్లాడుతూ కేవీపీఎస్‌ పోరాట ఫలితంగానే ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లప్ప, నిర్మల, క్రాంతికుమార్‌, కృష్ణమోహన్‌, దేవసహాయం, పి.ఎస్‌.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నగరంలో కేవీపీఎస్‌ ర్యాలీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని