logo

తాత హత్య కేసులో మనవడి అరెస్టు

కర్నూలులో మాధవీనగర్‌కు చెందిన మేడవరం సుబ్రమణ్య శర్మ(84) హత్య కేసులో అతని మనవడు దీపక్‌శర్మను కర్నూలు మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 07 Dec 2022 03:26 IST

నిందితుని అరెస్టు వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ కె.వి.మహేశ్‌, సీఐ తబ్రేజ్‌, ఎస్సై శ్రీనివాసులు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలులో మాధవీనగర్‌కు చెందిన మేడవరం సుబ్రమణ్య శర్మ(84) హత్య కేసులో అతని మనవడు దీపక్‌శర్మను కర్నూలు మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఠాణాలో కర్నూలు డీఎస్పీ కె.వి.మహేశ్‌, సీఐ తబ్రేజ్‌, ఎస్సై శ్రీనివాసులతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. వ్యవసాయశాఖలో సీనియర్‌ సహాయకుడిగా పనిచేసిన సుబ్రహ్మణ్యశర్మ 1996లో పదవీవిరమణ పొందారు. భార్య, పెద్దకుమారుడు చనిపోవటంతో కోడలు అరుణ, మనవడు దీపక్‌శర్మతో కలిసి ఉండేవారు. మనవడు దీపక్‌శర్మ తన పెన్షన్‌ డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తుండటంతో మందలించేవారు. తాతపైన దీపక్‌శర్మ పగ పెంచుకున్నాడు. ఈనెల 3న ఉదయం ఇంటికి వచ్చిన దీపక్‌ తాతతో గొడవపెట్టుకుని వంటగదిలో మూడు కత్తులు తీసుకుని సుబ్రహ్మణ్యశర్మ గొంతుకోసి, గుండెపై పొడిచి చంపేశాడు. ఒంటిమీద రక్తం పడటంతో స్నానం చేసి దుస్తులను దిన్నెదేవరపాడుకు వెళ్లే మార్గంలోని ముళ్లచెట్లలో పడేశాడు. అనంతరం తనకేమీ తెలియనట్లు వ్యవహరించాడు. దీపక్‌శర్మను విచారించిన సీఐ తబ్రేజ్‌, సిబ్బంది అతనే ఈ హత్య చేసినట్లు గుర్తించి అరెస్టు చేశారు.

అనారోగ్యం తాళలేక ఆత్మహత్య

కర్నూలు నేరవిభాగం: కర్నూలులోని ఎర్రబురుజుకు చెందిన పేరపోగు చిన్న హుసేనయ్య(35) అనారోగ్యం తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. హుసేనయ్య జిల్లా పోలీసు కార్యాలయంలో నాలుగో తరగతి ఉద్యోగి. ఆయనకు భార్య వరలక్ష్మి, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం గడ్డిమందు తాగారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. కర్నూలు ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని