logo

సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే

సీపీఎస్‌ను రద్దు చేసి వెంటనే పాత పింఛను విధానం అమలుచేయాలని ఎస్‌టీటీఎఫ్‌ (షెడ్యూల్డు ట్రైబల్స్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, రామకృష్ణ డిమాండ్‌ చేశారు. నంద్యాల పట్టణంలోని కార్యాలయంలో ఆదివారం వారు మాట్లాడారు.

Published : 04 Dec 2023 03:40 IST

నంద్యాల గాంధీచౌక్‌, న్యూస్‌టుడే: సీపీఎస్‌ను రద్దు చేసి వెంటనే పాత పింఛను విధానం అమలుచేయాలని ఎస్‌టీటీఎఫ్‌ (షెడ్యూల్డు ట్రైబల్స్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగరాజు, రామకృష్ణ డిమాండ్‌ చేశారు. నంద్యాల పట్టణంలోని కార్యాలయంలో ఆదివారం వారు మాట్లాడారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పటివరకు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.  ఇకనైనా స్పందించకుంటే పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షుడు జవహర్‌లాల్‌ నాయక్‌, నాయకులు రాము, కేశాలు నాయక్‌, ప్రభాకర్‌, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని