logo

ముస్లిం మైనార్టీలకు చంద్రబాబు అండ

ముస్లింల అభివృద్ధికి చేయూతనిచ్చింది తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమేనని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌ అన్నారు. బనగానపల్లిలోని ఆర్‌ఆర్‌ ఫంక్షన్‌ హాలులో ఆదివారం జరిగిన తెదేపా ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Published : 04 Dec 2023 03:41 IST

మాట్లాడుతున్న శాసనమండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌, పక్కన మాజీ ఎమ్మెల్యే బీసీ, ఫరూఖ్‌, మల్లెల రాజశేఖర్‌

బనగానపల్లి, న్యూస్‌టుడే: ముస్లింల అభివృద్ధికి చేయూతనిచ్చింది తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమేనని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ షరీఫ్‌ అన్నారు. బనగానపల్లిలోని ఆర్‌ఆర్‌ ఫంక్షన్‌ హాలులో ఆదివారం జరిగిన తెదేపా ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చంద్రబాబునాయుడు హయాంలో ముస్లిం మైనార్టీల కోసం రూ.3,600 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు వివరించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే దుల్హన్‌ పథకాన్ని రద్దు చేసిందన్నారు. మైనార్టీ కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తెచ్చి ఉర్దూను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందన్నారు. మాజీ మంత్రి ఎన్‌ఎండీ ఫరూఖ్‌ మాట్లాడుతూ తెదేపా హయాంలోనే మసీదులు, షాదీఖానాలకు పెద్దఎత్తున నిధులు మంజూరైనట్లు చెప్పారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ మాట్లాడుతూ చంద్రబాబు రంజాన్‌ తోఫాను ప్రవేశపెట్టి ఎందరికో చేయూతనివ్వగా ఈ ముఖ్యమంత్రి రద్దు చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ముస్లింల కోసం తాను అప్పటి సీఎం చంద్రబాబుతో మాట్లాడి పట్టణంలో రూ.కోటి నిధులతో షాదీఖానా ఏర్పాటుకు పనులు ప్రారంభించినట్లు చెప్పారు. 60 శాతం పనులు పూర్తి చేయగా ప్రస్తుత ఎమ్మెల్యే కాటసాని దీనిని పక్కన పెట్టారని.. ఊరికి దూరంగా షాదీఖానా నిర్మించేందుకు పనులు చేయించడమేమిటని ప్రశ్నించారు. నిధులు చాలకపోతే తాను సొంతంగా రూ.30 లక్షలు ఇచ్చానని చెప్పారు. అంతకు ముందు ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. ఖాసీంబాబు, సలాం, కలాం, అల్తాఫ్‌, సయ్యద్‌ ఉసేన్‌, అహమ్మద్‌   తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని