logo

ఆర్యవైశ్యులంటే కులం కాదు.. కుటుంబం

ఆర్యవైశ్యులంటే కులం కాదు, కుటుంబమని, అందరూ కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలని మాజీ ఎంపీ టి.జి.వెంకటేశ్‌, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు టి.జి.భరత్‌ అన్నారు. కర్నూలు నగర శివారులోని గాయత్రీ గోశాలలో ఆదివారం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం, కార్తిక వనభోజనం నిర్వహించారు.

Published : 04 Dec 2023 03:43 IST

మాట్లాడుతున్న మాజీ ఎంపీ టి.జి.వెంకటేశ్‌,చిత్రంలో తెదేపా నియోజకవర్గ బాధ్యుడు టి.జి.భరత్‌ తదితరులు

కర్నూలు బి.కాంపు, న్యూస్‌టుడే: ఆర్యవైశ్యులంటే కులం కాదు, కుటుంబమని, అందరూ కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలని మాజీ ఎంపీ టి.జి.వెంకటేశ్‌, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు టి.జి.భరత్‌ అన్నారు. కర్నూలు నగర శివారులోని గాయత్రీ గోశాలలో ఆదివారం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం, కార్తిక వనభోజనం నిర్వహించారు. టి.జి.వెంకటేశ్‌ మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరినీ ఒక చోట చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఆర్యవైశ్యులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. ఆర్యవైశ్యుల నాయకత్వాన్ని బలపర్చుకోవాలన్నారు. టి.జి.భరత్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తన పిల్లల్ని గోసేవ చేసేలా ప్రోత్సహించాలన్నారు. ఆర్యవైశ్యులకు గుర్తింపు రావాలంటే ఐక్యత చాలా అవసరమన్నారు. తాను గెలిస్తే కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు విశేషంగా అలరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని