logo

సంగమేశ్వరుని దర్శనం.. సకల పాపహరణం

సప్త నదుల్లో స్నానం ఆచరించి సంగమేశ్వరున్ని దర్శనం చేసుకుంటే పాపల నుంచి విముక్తి కలిగి మోక్షం లభించి నరక లోక ప్రవేశం తప్పుతుందని భక్తుల విశ్వాసం. అందువల్లే ఈ ఆలయం ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే దర్శన భాగ్యం ఉండటంతో సందర్శన కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు.

Updated : 04 Dec 2023 06:02 IST

బయటపడిన సంగమేశ్వర గర్భాలయం

కొత్తపల్లి, న్యూస్‌టుడే: సప్త నదుల్లో స్నానం ఆచరించి సంగమేశ్వరున్ని దర్శనం చేసుకుంటే పాపల నుంచి విముక్తి కలిగి మోక్షం లభించి నరక లోక ప్రవేశం తప్పుతుందని భక్తుల విశ్వాసం. అందువల్లే ఈ ఆలయం ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే దర్శన భాగ్యం ఉండటంతో సందర్శన కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. జూలై మూడో వారంలో కృష్ణమ్మ ఒడిలో ఆలయం ఉంది. ఈ ఏడాది వర్షాభావంతో శ్రీశైల జలాశయ నీటిమట్టం త్వరగా తగ్గిన నేపథ్యంలో 4 నెలలకే పూర్తిస్థాయిలో ఆలయం దర్శనం భాగ్యం లభించింది. ధర్మరాజు ప్రతిష్ఠించిన వేపధారుణి లింగం దర్శనమిచ్చింది. పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ ఆధ్వర్యంలో శనివారం రాత్రి శ్రీలలితా సంగమేశ్వర స్వామి, వినాయకుడు తొలి పూజలు అందుకున్నారు. సంగమేశ్వర దశాబ్దాల చరిత్ర కలిగి ఉన్న ఆధ్యాత్మిక ప్రాంతం. ఆలయ సముదాయం ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయం సుమారు 200 ఏళ్ల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు. ముఖమండపం పూర్తిగా శిథిలం కాగా అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు, శివుడు వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు.

తొలిపూజ అందుకున్న సంగమేశ్వరుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని