logo

క్షేత్ర దర్శనం.. సమాజ చైతన్యం

ఆ బృందం దేశవ్యాప్తంగా ఉన్న ధైవ క్షేత్రాలను సందర్శిస్తోంది. ఇదేదో తీర్థయాత్ర అనుకుంటే పొరపాటే. కాలుష్య నియంత్రణపై దృష్టిసారించారు. డీజిల్‌, పెట్రోలు వాడకంతో తలెత్తే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించి, చైతన్యపరుస్తున్నారు. వారంతా వివిధ రంగాల్లో పనులు చేస్తున్నారు. వారి లక్ష్యమంతా ఒక్కటే.. ప్రకృతి సంపదను రక్షించాలి.

Updated : 04 Dec 2023 06:02 IST

కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ..  
సైకిల్‌పై బృంద పర్యటన

సైకిళ్లపై వెళ్తున్న బాలన్‌, కమలాకర్‌ తదితరులు

న్యూస్‌టుడే, పత్తికొండ, తుగ్గలి : ఆ బృందం దేశవ్యాప్తంగా ఉన్న ధైవ క్షేత్రాలను సందర్శిస్తోంది. ఇదేదో తీర్థయాత్ర అనుకుంటే పొరపాటే. కాలుష్య నియంత్రణపై దృష్టిసారించారు. డీజిల్‌, పెట్రోలు వాడకంతో తలెత్తే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించి, చైతన్యపరుస్తున్నారు. వారంతా వివిధ రంగాల్లో పనులు చేస్తున్నారు. వారి లక్ష్యమంతా ఒక్కటే.. ప్రకృతి సంపదను రక్షించాలి. సైకిళ్లపై ప్రయాణం సాగిస్తున్నారు.

వాయు కాలుష్యం పెరుగుతోంది..

బెంగళూరుకు చెందిన పెడెల్‌ పుషర్స్‌ సైకిల్‌ టీమ్‌ సభ్యులు అక్కడి నుంచి మంత్రాలయానికి చేపట్టిన సైకిల్‌ యాత్ర ఆదివారం ఉదయం తుగ్గలి గ్రామం మీదుగా సాగింది. పెట్రోల్‌, డీజిల్‌ వాడకం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని చెబుతూ.. సైకిల్‌ తొక్కితో సంపూర్ణ ఆరోగ్య వంతులుగా జీవించవచ్చని గ్రామీణులను చైతన్యం చేస్తున్నారు. సైకిల్‌ యాత్రకు వచ్చిన ఆరుగురిలో ముగ్గురు 60 ఏళ్లు పైబడిన వారు ఉండటం విశేషం. ఆ సైకిల్‌ గుంపులో 25 మంది ఉన్నారన్నారు. వారిలో డీఆర్‌డీఏలో పరిపాలనాధికారిగా, ఫార్మసూటికల్‌ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన కమలాకర్‌, బాలన్‌ తదితరులు ఉన్నారు. ఇంతకు మునుపే సైకిల్‌ యాత్ర ద్వారా తిరుపతి, ధర్మస్థలం, పళని, తిరువణ్ణామలై క్షేత్రాలను చుట్టివచ్చామన్నారు. ఈసారి బృందంలో ఆరుగురు సభ్యులతో బెంగుళూరు పట్టణం నుంచి శనివారం ఉదయం బయల్దేరి రాత్రి అనంతపురంలో బస చేశాం. ఆదివారం ఉదయం అనంతపురం నుంచి బయల్దేరి సాయంత్రానికి మంత్రాలయం చేరుకొని రాఘేంద్ర స్వామి దర్శనం చేసుకొంటామని సభ్యులు చెబుతున్నారు. క్షేత్రాల వద్ద గుమికూడిన జనానికి వాయు కాలుష్యంతో కలిగే అనర్థాలు వివరిస్తూ.. సైకిల్‌ తొక్కడం వలన కలిగే మానసిక ఆనందం, ఆరోగ్యం గురించి యాత్రికులకు వివరిస్తామన్నారు. ఆధ్యాత్మిక భావాలతో పాటు ప్రశాంత జీవనం సాగించటంపై అవగాహన కల్పిస్తున్నామని విశ్రాంత బ్రిగేడియర్‌ రవిమునిస్వామి, సభ్యులు బాలన్‌, కమలాకర్‌ తదితరులు తెలిపారు.

సన్మార్గంలో నడవాలి

- రవి మునిస్వామి, విశ్రాంత బ్రిగేడియర్‌

సైన్యంలో బ్రిగేడియర్‌ హోదాలో దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేశా. అంతేకాకుండా విదేశాల్లో శ్రీలంక, బూటాను, మయన్మార్‌ దేశాల్లో యాంటీటెర్రరిస్టు దళాలతో పనిచేశా. విశ్రాంత జీవనంలో బెంగళూరు పట్టణంలో సైక్లింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసుకొని ప్రముఖ పుణ్యక్షేత్రాలు దర్శించుకొంటున్నాం. టీమ్‌లో ఆరుగురు సభ్యులతో కలిసి రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చాం. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికత అలవరచుకోవాలి, ఆధ్యాత్మికతతో ప్రశాంత జీవనం గడపవచ్చు. ఆధ్యాత్మికతతో మనను ప్రశాంతంగా ఉండి సన్మార్గంలో నడుస్తారు, అప్పుడే సమాజం బాగుంటుందని ప్రచారం చేస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని