logo

వ్యవసాయ సంక్షోభంతో తీవ్ర నష్టం

వ్యవసాయ సంక్షోభం కారణంగా అందరికీ తీవ్రనష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి, సంయుక్త కిసాన్‌ మోర్చా రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఏఐకేఎస్‌ అఖిల భారత ఉపాధ్యక్షుడు టి.సాగర్‌ అన్నారు.

Updated : 04 Dec 2023 06:00 IST

మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు 

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు

కర్నూలు గ్రామీణం, కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: వ్యవసాయ సంక్షోభం కారణంగా అందరికీ తీవ్రనష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి, సంయుక్త కిసాన్‌ మోర్చా రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఏఐకేఎస్‌ అఖిల భారత ఉపాధ్యక్షుడు టి.సాగర్‌ అన్నారు. జిల్లా పరిషత్‌ ప్రాంగణంలోని ఎంపీపీ భవనంలో ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ అధ్యక్షతన ‘వ్యవసాయరంగ సంక్షోభం..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి’ అంశంపై ఆదివారం సదస్సు నిర్వహించారు. వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, కౌలు రైతులు, కూలీలు సంక్షోభంలో ఉన్నారని, వ్యవసాయన్ని ఆధారంగా చేసుకొని వ్యాపారం సాగిస్తున్నవారు లాభాల్లో ఉన్నారన్నారు. నష్టాల కారణంగా ఏటా వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  విద్యుత్తు సవరణ బిల్లుతో Œప్రజలందరికీ నష్టమన్నారు. కరవు నివారణ, వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం, నీటిపారుదలపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించేందుకు ఏఐకేఎస్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో ఒత్తిడి చేసేలా తీర్మానం చేయాలన్నారు. ఏఐకేఎస్‌ జాతీయ కౌన్సిల్‌ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య, సహాయ కార్యదర్శి రాజశేఖర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి, ఏఐకేఎస్‌ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల ఆహ్వాన సంఘం నాయకులు    ప్రసాద్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని