logo

ఓ విద్యార్థి మేలుకో.. భవిష్యత్తు కాపాడుకో

రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిని విద్యార్థులే సాగనంపుతారని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు.

Updated : 05 Dec 2023 06:21 IST

గోడ, కరపత్రాలు ఆవిష్కరిస్తున్న తెదేపా కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు బీటీ నాయుడు, మల్లెల రాజశేఖర్‌ తదితరులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిని విద్యార్థులే సాగనంపుతారని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘ఓ విద్యార్ద్థి మేలుకో.. భవిష్యత్తు కాపాడుకో’ కార్యక్రమానికి సంబంధించిన గోడ, కరపత్రాలను తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌, తెదేపా నేతలు రాంపుల్లయ్య యాదవ్‌, పీజీ నరసింహులు యాదవ్‌, నరసింహులు తదితరులతో కలిసి సోమవారం ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు మహేష్‌ గౌడ్‌, నాగరాజు యాదవ్‌, పెద్దయ్య, రాజ్‌కుమార్‌, కిషోర్‌ కుమార్‌, కృష్ణ, భరత్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని