logo

తాగునీరు ఇస్తేనే.. ఓటేస్తాం

తాము కొన్నేళ్లుగా కాలనీలో తాగునీరు, మురుగుకాల్వ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.

Updated : 05 Dec 2023 06:20 IST

తేల్చిచెప్పిన అరేకల్లు గ్రామస్థులు

ఎమ్మెల్సీ మధుసూదన్‌కు సమస్యలు విన్నవిస్తున్న మహిళలు

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: తాము కొన్నేళ్లుగా కాలనీలో తాగునీరు, మురుగుకాల్వ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.. తమ సమస్యను పరిష్కరిస్తేనే ఓటు వేస్తామని, లేదంటే వేసే ప్రసక్తే లేదని ఎమ్మెల్సీ డాక్టరు మధుసూదన్‌కు గ్రామస్థులు తేల్చిచెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అరేకల్లు గ్రామంలో ఎమ్మెల్యే సాయప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టరు మధుసూదన్‌ తదితరులు హాజరయ్యారు. దళిత కాలనీలో వారు పర్యటించారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ముందుకెళ్లిన తర్వాత కొద్దిసేపు  అక్కడే నిలబడి ఉన్న ఎమ్మెల్సీ దృష్టికి కాలనీవాసులు సమస్యలు విన్నవించారు. తమ సమస్య పరిష్కరిస్తేనే ఓటు వేస్తామని.. లేదంటే వేయమని కాలనీకి చెందిన మహిళలు ఉల్తమ్మ, కారమ్మ, సుజాత, భాగ్యమ్మ తదితరులు పేర్కొన్నారు.  ఎమ్మెల్సీ స్పందిస్తూ.. మీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని