logo

కరవు నష్టం లెక్క తేల్చారు

జిల్లాలో 24 కరవు మండలాల్లో లెక్క తేల్చారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు, గ్రామస్థాయిలో వీఆర్వో, గ్రామ వ్యవసాయ సహాయకులు పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పంటలు  గణించారు.

Published : 05 Dec 2023 01:33 IST

రూ.368.36 కోట్ల పరిహారానికి ప్రతిపాదనలు

కర్నూలు వ్యవసాయం, న్యూస్‌టుడే : జిల్లాలో 24 కరవు మండలాల్లో లెక్క తేల్చారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు, గ్రామస్థాయిలో వీఆర్వో, గ్రామ వ్యవసాయ సహాయకులు పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పంటలు  గణించారు. ఆయా మండలాల్లో 2,38,231.42 హెక్టార్లలో పంటనష్టం జరిగినట్లు నిర్ధారించారు. 2,90,741 మంది రైతులకు రూ.368.36 కోట్ల పంట నష్టపరిహారం ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆమోదంతో ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారిణి పీఎల్‌ వరలక్ష్మి సోమవారం తెలిపారు. ఒక రైతుకు పంట నష్టపరిహారం గరిష్ఠంగా రెండు హెక్టార్లకే పరిమితం చేయడంతో ప్రస్తుత నివేదికల ప్రకారం పంట నష్టం తగ్గిందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ప్రాథమిక నివేదికలతో పోలిస్తే 41,360 మంది రైతులకు సంబంధించి 38,483 హెక్టార్ల విస్తీర్ణం తగ్గడం గమనార్హం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని