logo

ఉర్దూ వర్సిటీపై జగన్‌ వివక్ష

ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విద్యే ప్రధాన ఆయుధమని భావించిన తెదేపా ప్రభుత్వం ఓర్వకల్లు వద్ద డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని.

Published : 05 Dec 2023 01:38 IST

నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం
భూములు ఆక్రమించేందుకు యత్నాలు
మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేత ధ్వజం

ఓర్వకల్లులోని ఉర్దూ విశ్వవిద్యాలయం వద్ద ఫ్లకార్డులతో నిరసన తెలుపుతున్న ముస్లిం మైనారిటీ నాయకులు

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: ముస్లింలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే విద్యే ప్రధాన ఆయుధమని భావించిన తెదేపా ప్రభుత్వం ఓర్వకల్లు వద్ద డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందని.. దీని అభివృద్ధికి నిధులు కేటాయించకుండా ప్రస్తుత వైకాపా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించటం దురదృష్టకరమని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్‌ ఫారూక్‌ షుబ్లీ ధ్వజమెత్తారు. ఆయనతో పలువురు ఓర్వకల్లులోని ఉర్దూ వర్సిటీని సోమవారం సందర్శించి ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. తొలగించిన ఉర్దూ వర్సిటీ బోర్డును తిరిగి అక్కడే నిలబెట్టారు. ఆయన మాట్లాడుతూ గత తెదేపా ప్రభుత్వం 2015లో 144 ఎకరాల విస్తీర్ణంలో అబ్దుల్‌ హక్‌ ఉర్దూ వర్సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. 2019 తర్వాత వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్సిటీ నిర్మాణానికి నిధులు కేటాయించకపోవటం దుర్మార్గమైన చర్య అని అన్నారు.  అనంతరం విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ రహిమాన్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌలానా హుసేన్‌, కార్యదర్శి అబ్దుల్‌ రజాక్‌, కర్నూలు నగర అధ్యక్షుడు ఉస్తాద్‌ ఇమ్రాన్‌, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ అబ్దుల్‌ గఫూర్‌, మహబూబ్‌బాషా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని