logo

నకిలీ పత్రాల దందా అరికట్టాలి

పశుసంవర్ధకశాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నకిలీ పత్రాల దందా జరుగుతోందని.. దీనిని అరికట్టాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Published : 05 Dec 2023 01:44 IST

నినాదాలు చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : పశుసంవర్ధకశాఖ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నకిలీ పత్రాల దందా జరుగుతోందని.. దీనిని అరికట్టాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గతంలో నకిలీ సర్టిఫికెట్లతో పలువురు పొందారన్నారు. ఈ దందా అరికట్టాలని కోరుతూ రాయలసీమ విద్యార్థి పోరాట సమితి, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద సోమవారం ధర్నా జరిగింది. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, ఎప్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగప్ప, అబ్దుల్లా, రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుంకన్న మాట్లాడుతూ పలువురు అభ్యర్థులు పెద్దఎత్తున నిధులు వెచ్చించి భారత్‌ సేవక్‌ సమాజ్‌ అనే సంస్థ ద్వారా నకిలీ పత్రాలు సంపాదిస్తున్నారని చెప్పారు. దీనిపై చర్యలు చేపట్టాలని.. అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అశోక్‌, మక్బుల్‌, వెంకటేశ్వర్లు, సుధాకర్‌, జయరామ్‌, గోపాల్‌, హరి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని