logo

ఆడుదాం.. ఆంధ్రా రిజిస్ట్రేషన్లపై దృష్టి సారించండి

‘ఆడుదాం.. ఆంధ్రా’లో క్రీడాకారులు రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల ఎంపీడీవోలను కలెక్టర్‌ డా.జి.సృజన ఆదేశించారు.

Published : 05 Dec 2023 01:45 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ‘ఆడుదాం.. ఆంధ్రా’లో క్రీడాకారులు రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల ఎంపీడీవోలను కలెక్టర్‌ డా.జి.సృజన ఆదేశించారు. ఆమె సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ ప్రభుత్వ అంశాలపై జిల్లాస్థాయి అధికారులు, వీడియో కాన్ఫరెన్సు ద్వారా మండలస్థాయి అధికారులతో సమీక్షించారు. కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్సు హాలు నుంచి జేసీ నారపురెడ్డి మౌర్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆడుదాం.. ఆంధ్రాకు సంబంధించి కర్నూలు అర్బన్‌, హాలహర్వి, కోడుమూరు, పెద్దకడబూరు, కోసిగి మండలాల్లో క్రీడాకారులను రిజిస్ట్రేషన్లు చేయించడంలో చాలా వెనుకబడి ఉన్నారని చెప్పారు.  రీ సర్వేకి సంబంధించి విలేజ్‌ సర్వేయర్‌, వీఆర్వో లాగిన్‌లలో పెండింగ్‌లో ఉన్న డేటా ఎంట్రీ పనుల కోసం నిర్దేశించిన సమయం కంటే ఎక్కువగా తీసుకుంటున్నారని వెల్దుర్తి, కల్లూరు, పత్తికొండ, తుగ్గలి, దేవనకొండ మండలాల తహసీల్దార్లను ప్రశ్నించారు. వెల్దుర్తి మండల సర్వేయర్‌ వీడియో కాన్ఫరెన్సుకు హాజరు కాకపోవడంతో తగిన చర్యలు తీసుకోవాలని సర్వే ఏడీని ఆదేశించారు. జేసీ మౌర్య మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న భూహక్కు పత్రాల పంపిణీ బుధవారం నాటికి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో డీఆర్వో మధుసూదన్‌రావు, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, డ్వామా పీడీ అమర్‌నాథ్‌రెడ్డి, హౌసింగ్‌ ఇన్‌ఛార్జి పీడీ సిద్ధలింగమూర్తి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని