logo

ఉద్యోగ భద్రత కల్పించాలి

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్ర సమయంలో సమగ్రశిక్షా ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చారని.. వీటిని తక్షణమే అమలు చేయాలని ఎస్‌ఎస్‌ఏ ఐకాస కమిటీ.

Published : 05 Dec 2023 01:47 IST

ఆందోళన చేస్తున్న సమగ్రశిక్షా, ఔట్‌స్సోరింగ్‌ ఉద్యోగులు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్ర సమయంలో సమగ్రశిక్షా ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చారని.. వీటిని తక్షణమే అమలు చేయాలని ఎస్‌ఎస్‌ఏ ఐకాస కమిటీ.. ఎంఐఎస్‌ యూనియన్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌, ఎంఐఎస్‌ సమన్వయకర్త మధుమోహన్‌, పార్ట్‌ టైం ఉపాధ్యాయులు మాదన్న, దివ్యవాణి తదితరులు డిమాండ్‌ చేశారు. కర్నూలు విద్యాశాఖ పరిధిలోని సమగ్రశిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ వద్ద సోమవారం ఆవేదన దీక్ష చేపట్టారు. వారు మాట్లాడుతూ ఉద్యోగులందరికి ఉద్యోగ భద్రత కల్పించాలని.. పార్ట్‌టైం విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల్లో సమగ్రశిక్షా ఉద్యోగులకు వెయిటేజీ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మధు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని