logo

బడి బయట పిల్లల సమాచారం ఇవ్వాలి

గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సర్వే 100 శాతం పూర్తయిన తర్వాత మిగిలి ఉన్న డ్రాపవుట్లను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సామూన్‌ తెలిపారు.

Published : 05 Dec 2023 01:48 IST

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సర్వే 100 శాతం పూర్తయిన తర్వాత మిగిలి ఉన్న డ్రాపవుట్లను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సామూన్‌ తెలిపారు. 5 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించామని ఆయన సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అన్ని మండలాలకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామన్నారు. సంబంధిత మండలాల్లో 30 గృహాలను ఒక్కొక్క అధికారి తనిఖీ చేసి నివేదికలు ఇస్తున్న నేపథ్యంలో ఏ ఒక్క పిల్లవాడు బడి బయట ఉండకుండా ఉండాలన్నదే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులను ప్రోత్సహిసున్నారని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని