logo

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

మిగ్‌జాం తుపాన్‌ పట్ల జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సామూన్‌ అధికారులను ఆదేశించారు.

Published : 05 Dec 2023 01:50 IST

కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సామూన్‌

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: మిగ్‌జాం తుపాన్‌ పట్ల జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ డా.మనజీర్‌ జిలాని సామూన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్‌ నుంచి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలు, విద్యుత్తు, రవాణా, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల, అగ్నిమాపకశాఖ, డీఎంహెచ్‌వో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షపాతం నమోదు వివరాలను ఆర్డీవోలు, తహసీల్దార్లు ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా సిద్ధంగా ఉండాలన్నారు. ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసుకుని సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

పాత మిద్దెల్లో ఉండొద్దు

ఎస్పీ రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు శిథిలావస్థలోని భవనాలు, పాత మిద్దెల్లో నివాసం ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సంయుక్త కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సిబ్బంది స్థానిక కేంద్రంలో నివాసం ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని