logo

నూతన రిజిస్ట్రేషన్‌ విధానాన్ని రద్దు చేయాలి

నూతన రిజిస్ట్రేషన్‌ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని తెదేపా నాయకులు డిమాండ్‌ చేశారు. కార్డు ప్రైమ్‌ 2.0 నూతన రిజిస్ట్రేషన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ నవంబరు 30 నుంచి కర్నూలులో దస్తావేజు లేఖరులు చేపట్టిన పెన్‌డౌన్‌ నిరసన కార్యక్రమానికి తెదేపా మద్దతు ఇచ్చింది.

Published : 08 Dec 2023 03:52 IST

జిల్లా రిజిస్ట్రార్‌ నాగలింగేశ్వరరావుకు వినతిపత్రం ఇస్తున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు బి.టి.నాయుడు,  మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తదితరులు

కర్నూలు గాయత్రీఎస్టేట్‌, న్యూస్‌టుడే: నూతన రిజిస్ట్రేషన్‌ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని తెదేపా నాయకులు డిమాండ్‌ చేశారు. కార్డు ప్రైమ్‌ 2.0 నూతన రిజిస్ట్రేషన్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ నవంబరు 30 నుంచి కర్నూలులో దస్తావేజు లేఖరులు చేపట్టిన పెన్‌డౌన్‌ నిరసన కార్యక్రమానికి తెదేపా మద్దతు ఇచ్చింది. గురువారం కర్నూలు నగరం అబ్బాస్‌నగర్‌లోని జిల్లా స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయం వద్ద ఉన్న దస్తావేజు లేఖరుల శిబిరాన్ని తెదేపా కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.టి.నాయుడు, పాణ్యం, కోడుమూరు నియోజకవర్గాల బాధ్యులు గౌరు చరిత, ఆకెపోగు ప్రభాకర్‌ సందర్శించి మద్దతు తెలిపారు. జిల్లా రిజిస్ట్రార్‌ నాగలింగేశ్వరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆలస్యమవుతోందన్నారు. 20 నిమిషాల్లో దస్తావేజులు ఇస్తామని చెప్పిన అధికారులు 20 రోజులైనా ఇవ్వటం లేదన్నారు. ప్రభుత్వం దస్తావేజులను ఇవ్వకపోవటంతో తాకట్టు పెట్టే కుట్ర జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దస్తావేజు లేఖరుల సమస్యను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తామన్నారు.  దస్తావేజు లేఖరుల సంఘం నాయకులు రహిమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని