logo

పన్ను చెల్లిస్తారా.. కుళాయి కనెక్షన్‌ తొలగించాలా

చెత్త పన్ను చెల్లింపు విషయంలో కర్నూలు నగరంలోని సచివాలయ సిబ్బంది నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అపార్టుమెంటువాసులకు తాఖీదులు జారీ చేసి, వసూలు కోసం సాయంత్రాలు వెళ్తున్నారు. కర్నూలు నగరంలోని బాలాజీనగర్‌లోని సాయిసదన్‌ అపార్ట్‌మెంట్‌లో చెత్తపన్ను వసూలుకు సాయంత్రం వేళ వచ్చి ఒత్తిడి చేస్తున్నారు.

Published : 08 Dec 2023 03:57 IST

బాలాజీనగర్‌లోని సాయిసదన్‌ అపార్ట్‌మెంట్‌కు వచ్చిన సిబ్బంది

చెత్త పన్ను చెల్లింపు విషయంలో కర్నూలు నగరంలోని సచివాలయ సిబ్బంది నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని అపార్టుమెంటువాసులకు తాఖీదులు జారీ చేసి, వసూలు కోసం సాయంత్రాలు వెళ్తున్నారు. కర్నూలు నగరంలోని బాలాజీనగర్‌లోని సాయిసదన్‌ అపార్ట్‌మెంట్‌లో చెత్తపన్ను వసూలుకు సాయంత్రం వేళ వచ్చి ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కో కుటుంబం రూ.వెయ్యి నుంచి రూ.3 వేల దాకా పన్ను చెల్లించాలని, కట్టకపోతే కుళాయి కనెక్షన్‌ తొలగిస్తామని, చెత్తబండి తిరగకుండా ఆపేస్తామని చెబుతున్నారు. ఈ అంశంపై పైఅధికారులను సంప్రదించగా చెత్తపన్ను పాతబకాయిలను విడతలవారీగా చెల్లించాలని చెబుతున్నామని, కొందరు సచివాలయ ఉద్యోగులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అన్నారు. క్షేత్రస్థాయిలో చెత్త వసూలుకు మూకుమ్మడిగా ఇళ్లముందు వాలిపోతున్నారన్నారు. ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, వారిపై చర్యలు తీసుకుంటామని సచివాలయ ఉద్యోగులు చెబుతుండటం గమనార్హం.

ఈనాడు, కర్నూలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని