logo

బకాయిల చెల్లింపులో నిర్లక్ష్యం

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌ బిల్లులు చెల్లించడం లేదని.. పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, 11వ పీఆర్సీ, సంపాదిత సెలవుల బకాయిలు రూ.30 కోట్లకుపైగా ఉన్నాయని, వీటి చెల్లించడంలో పూర్తిగా విఫలమైందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి అన్నారు. ఎమ్మిగనూరులో  ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు చెందిన నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు.

Published : 08 Dec 2023 04:02 IST

ప్రతిజ్ఞ చేస్తున్న ఎస్టీయూ నాయకులు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే : రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌ బిల్లులు చెల్లించడం లేదని.. పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ, 11వ పీఆర్సీ, సంపాదిత సెలవుల బకాయిలు రూ.30 కోట్లకుపైగా ఉన్నాయని, వీటి చెల్లించడంలో పూర్తిగా విఫలమైందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి అన్నారు. ఎమ్మిగనూరులో  ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు చెందిన నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తోందని, అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అనంతరం ఎమ్మిగనూరు మండల ఎస్టీయూ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సురేష్‌, ప్రధాన కార్యదర్శిగా శేఖర్‌, కౌన్సిల్‌ సభ్యులుగా ప్రసన్నరాజు, బాబయ్య, వెంకటరాముడు, నాగరాజును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నేతలు జనార్దన్‌,   ప్రసన్నరాజు, సురేష్‌, శేఖర్‌, ఏసేపు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని