logo

జాబితాలో తప్పులు సవరించండి

ఓటరు జాబితాలో తప్పులను వెంటనే సరి చేయాలని, స్వీప్‌ కార్యక్రమం ద్వారా జిల్లాలో విస్తృతంగా ఓటరు అవగాహన సదస్సులు చేపట్టాలని రాష్ట్ర అదనపు ముఖ్య ఎలక్టోరల్‌ అధికారి హరేంద్ర ప్రసాద్‌ ఆదేశించారు.

Published : 08 Dec 2023 04:05 IST

వీడియో కాన్ఫరెన్సులో జేసీ మౌర్య, డీఆర్వో మధుసూదన్‌రావు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ఓటరు జాబితాలో తప్పులను వెంటనే సరి చేయాలని, స్వీప్‌ కార్యక్రమం ద్వారా జిల్లాలో విస్తృతంగా ఓటరు అవగాహన సదస్సులు చేపట్టాలని రాష్ట్ర అదనపు ముఖ్య ఎలక్టోరల్‌ అధికారి హరేంద్ర ప్రసాద్‌ ఆదేశించారు. ఆయన గురువారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు, సవరణ కార్యక్రమంలో భాగంగా విద్యాలయాలు, గిరిజన గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో స్వీప్‌ (ఎస్‌వీఈఈపీ) కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. ఓటరు జాబితాపై పూర్తిస్థాయిలో దృష్టి సారించామని.. సవరింపులు, తొలగింపులు చేపట్టామని చెప్పారు. ఈనెల 12లోగా పూర్తిగా పరిష్కరిస్తామని నివేదించారు. ఒకే ఇంటితో పది, అంతకంటే ఎక్కువ ఓటర్లు ఉన్నవాటిపై విచారణను త్వరలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జేసీతోపాటు డీఆర్వో మధుసూదన్‌రావు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ మురళి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని