logo

కొత్తగా పనులు చేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే

‘గతంలో చేసిన పనులకే ఇంతవరకు బిల్లులు రాలేదు. కొత్తగా పనులు చేస్తే మేము ఆస్తులు అమ్ముకోవాల్సిందే’ అని అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్‌ పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు.

Updated : 08 Dec 2023 06:01 IST

అధికార పార్టీ జడ్పీటీసీ సభ్యుడి ఆవేదన

మాట్లాడుతున్న ఛైర్మన్‌ పాపిరెడ్డి, పక్కన ఉపాధ్యక్షురాలు దిల్‌షాద్‌నాయక్‌, సీఈవో నాసరరెడ్డి

కర్నూలు జడ్పీ, న్యూస్‌టుడే: ‘గతంలో చేసిన పనులకే ఇంతవరకు బిల్లులు రాలేదు. కొత్తగా పనులు చేస్తే మేము ఆస్తులు అమ్ముకోవాల్సిందే’ అని అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్‌ పాపిరెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గడివేముల జడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్‌రెడ్డి తన ఆవేదన వెలిబుచ్చారు. పనులు చేపట్టి బిల్లుల కోసం ఎదురుచూసి విసిగిపోతున్నామని తెలిపారు. అటు పంచాయతీరాజ్‌శాఖ, ఇటు ఆర్‌డబ్ల్యూఎస్‌లో చేసిన పనులకు బిల్లులు రావడం లేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అధికారులతో  మాట్లాడుతానని జడ్పీ ఛైర్మన్‌ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని