logo

గుమ్మనూరు ఫ్యాన్‌ను పక్కన పెట్టనున్నారా?

ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వైకాపాను వీడనున్నారనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి.

Published : 23 Feb 2024 02:01 IST

ఆలూరు జడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్‌, మార్కెట్‌యార్డు వైస్‌ ఛైర్మన్‌

చిన్నఈరన్నతో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌ఛార్జి రామసుబ్బారెడ్డి

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వైకాపాను వీడనున్నారనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. నేడో రేపో ‘ఫ్యాన్‌’ను పక్కనపెట్టి సైకిల్‌ ఎక్కే ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పకనే చెబుతున్నాయి. నియోజకవర్గంలో ఇద్దరు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మార్కెట్‌యార్డు ఛైర్మన్‌, సహకార సంఘం అధ్యక్షులు, సర్పంచులూ మంత్రి జయరాంతో కలిసివెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆరా తీస్తున్న వైకాపా అధిష్ఠానం

నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా వైకాపా అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఎలాగైనా వారిని అటువైపుగా అడుగులు వేయకుండా అడ్డుకట్టవేయాలని భావించింది. దీంతో వైకాపా జిల్లా ఇన్‌ఛార్జి రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పార్టీ సమన్వయకర్త విరూపాక్షి, జేసీఎస్‌ కో-ఆర్డినేటర్‌ సురేంద్రరెడ్డి గురువారం ఆలూరు నియోజకవర్గంలోని ఆయా మండలాల నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులతో మంతనాలు సాగించారు. వ్యక్తి కాదు.. పార్టీ ముఖ్యమని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలూరు నాయకత్వంపై, నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తారని.అందరికీ పార్టీ అండగా ఉంటుందని చెప్పినట్లు సమాచారం.

ఈ నెల చివర్లో ముహూర్తం

ఆలూరు నియోజకవర్గంలో వాల్మీకి సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువ.. వారి ఓట్లతోనే గుమ్మనూరు  రెండు పర్యాయాలు గెలుపొంది మంత్రిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను కర్నూలు ఎంపీగా బరిలో నిలిపి ఆలూరులో చిప్పగిరి జడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షికి అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి మంత్రి జయరాం దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో మంతనాలు జరిపినా ఫలితం లేకుండాపోయింది.  ఈ నెల చివర్లో తెదేపాలో చేరనున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని