logo

యథేచ్ఛగా ఇసుక దోపిడీ

రాష్ట్రంలో జగన్‌రెడ్డి ఇసుక దోపిడీకి 130 మంది భవన నిర్మాణ కార్మికులు బలయ్యారని.. వైకాపా నేతల ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 48 మంది ప్రాణాలు కోల్పోయారని తెదేపా కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు బీటీ నాయుడు, మల్లెల రాజశేఖర్‌ ఆరోపించారు.

Updated : 23 Feb 2024 05:42 IST

 కేంద్ర పర్యావరణ నివేదికపై జగన్‌రెడ్డి ఏం చెబుతారు?
నిలదీసిన తెదేపా నేతలు

మాట్లాడుతున్న తెదేపా కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు బీటీ నాయుడు, మల్లెల రాజశేఖర్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో జగన్‌రెడ్డి ఇసుక దోపిడీకి 130 మంది భవన నిర్మాణ కార్మికులు బలయ్యారని.. వైకాపా నేతల ఇసుక మాఫియా కారణంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 48 మంది ప్రాణాలు కోల్పోయారని తెదేపా కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు బీటీ నాయుడు, మల్లెల రాజశేఖర్‌ ఆరోపించారు. వారు గురువారం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎఫ్‌) హైకోర్టు తెలిపిందని చెప్పారు. రాష్ట్రంలో 500కు పైగా ఇసుక రీచ్‌ల్లో పర్యావరణ అనుమతులు లేకున్నా తవ్వకాలు జరుగుతున్నాయని ఎన్జీటీ వెల్లడించిందని పేర్కొన్నారు. కేంద్ర పర్యావరణ శాఖ నివేదికపై జగన్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జిల్లాలో తుంగభద్ర తీరం వెంబడి ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయని, ప్రజాప్రతినిధులు ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలించి రూ.కోట్లు ఆర్జిస్తున్నారని దుయ్యబట్టారు. తెదేపా హయాంలో ట్రాక్టర్‌ ఇసుక రూ.1,000 ఉండగా.. వైకాపా ప్రభుత్వ హయాంలో అదే ట్రాక్టర్‌ ఇసుక రూ.6 వేలు పలుకుతోందన్నారు. ఇసుకతో దోచుకున్న డబ్బుతో రానున్న ఎన్నికల్లో గెలవాలని జగన్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెదేపా అధికారంలోకి రాగానే వైకాపా నేతలు బొక్కిన ఇసుకంతా కక్కిస్తామని పేర్కొన్నారు.

కాటసాని ఆజ్ఞతోనే దాడులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కర్నూలులోని ఈనాడు కార్యాలయంపై దాడి జరిగిన వెంటనే పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి తాడేపల్లి నుంచి పిలుపు వచ్చిందని.. ఆయన రాత్రికిరాత్రే బయలుదేరి వైకాపా అధిష్ఠానంతో అక్షింతలు వేయించుకున్నారని.. దాడి ఘటన గురించి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం మాట్లాడారు.    కాటసాని అక్రమాలపై ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని