logo

మానవత్వం చాటిన విద్యార్థి

వికలాంగుడికి మరో వికలాంగ విద్యార్థి చేసిన సాయానికి అందరూ అభినందించారు.

Published : 23 Feb 2024 18:11 IST

నందికొట్కూరు గ్రామీణం: వికలాంగుడికి మరో వికలాంగ విద్యార్థి చేసిన సాయానికి అందరూ అభినందించారు. కర్నూలుకు చెందిన వికలాంగుడు గోరంట్ల శుక్రవారం నందికొట్కూరు పట్టణానికి పనిపై వచ్చాడు. తన పని ముగించుకొని బస్టాండ్‌కు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. అదే సమయంలో బసిరెడ్డి కళాశాలలో డిగ్రీ చదువుతున్న వడ్డెమానుశివ.. వికలాంగుడుని చూశాడు. వెంటనే శివ చలించి పోయి తనకు ఒక చెయ్యి లేకపోవడంతో ఒక్కడినే తీసుకెళ్లలేనని, తన పక్కనున్న స్నేహితుడు భవానీ శంకర్‌కు చెప్పాడు. శివ తనకున్న ఒక చేతితో ఒ పక్క పట్టుకుని, మరో పక్క తనస్నేహితుని సాయంతో గోరంట్లను పట్టుకుని సూమారు 200మీటర్ల దూరం తీసుకవచ్చి సురక్షితంగా బస్సు ఎక్కించారు. తీసుకెళ్లే సమయంలో ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు చలించి పోయారు. శివ చేసిన సాయాన్ని చూసి అందరూ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని