logo

రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న అన్నారు.

Published : 23 Feb 2024 18:11 IST

రైతు నగరం(నంద్యాల): కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సోమన్న అన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. శుక్రవారం బ్లాక్ డే గా పాటిస్తూ నంద్యాల సాయిబాబా నగర్ కూడలిలో దిల్లీ సరిహద్దుల్లో రైతుల పట్ల కేంద్రం అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ రైతు సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఐ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై పోలీసులు సరిహద్దుల వద్ద కాల్పులు జరపడంతో యువరైతు శుభకరణ సింగ్ మరణించాడని, చాలామంది గాయాల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో నాయకులు కే ప్రసాద్, ధనుంజయుడు, నారాయణమ్మ, వెర్రి స్వామి, బాబు, మురళి, శీను, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని