logo

నాసిరకం విత్తనాలు అమ్మారని రైతుల ఆందోళన

ఆదోని పట్టణంలోని గీత విత్తన దుకాణదారులు తమకు నాసిరకం విత్తనాలు అంటగట్టారని ఆదోని మండలం సలకలకొండ గ్రామ రైతులు ఆందోళన చేశారు.

Published : 23 Feb 2024 19:58 IST

ఆదోని మార్కెట్: ఆదోని పట్టణంలోని గీత విత్తన దుకాణదారులు తమకు నాసిరకం విత్తనాలు అంటగట్టారని ఆదోని మండలం సలకలకొండ గ్రామ రైతులు ఆందోళన చేశారు. శుక్రవారం దుకాణం ముందు రైతులు ఆందోళన నుంచి నిర్వహించారు. పంట రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన రైతులు దుకాణానికి చేరుకొని యజమానిని నిలదీశారు. యజమాని పట్టించుకోకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో చేసేదిలేక రైతులు తమకు న్యాయం చేయాలని రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసిన సముదాయించే ప్రయత్నం చేసిన రైతులు వినిపించుకోలేదు. తమకి న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు