logo

తాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలి

ఆళ్లగడ్డలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో కమిషనర్‌ తెలపాలని, లేదంటే ఆయన కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హెచ్చరించారు

Published : 24 Feb 2024 02:09 IST

భూమా అఖిలప్రియ

భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భూమా అఖిలప్రియ

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే : ఆళ్లగడ్డలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో కమిషనర్‌ తెలపాలని, లేదంటే ఆయన కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హెచ్చరించారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆమె పాలసాగరం రోడ్డులో ఇంటింటి ప్రచారం చేశారు. ఆళ్లగడ్డలో నీటి సమస్య ఎదురైతే అధికార పార్టీ నాయకులు నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసి ప్రజల సొమ్ము దోచుకునేందుకు యత్నిస్తున్నారని అఖిలప్రియ ఆరోపించారు. తెదేపా ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులను ఎమ్మెల్యే పూర్తి చేయడంలో వెనుకబడ్డారని ధ్వజమెత్తారు. స్థానికంగా నిర్మించిన స్టేడియం రేకుల షెడ్డును తలపిస్తోందన్నారు. రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా తెదేపా పాలన సాగించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ప్రసాద్‌, హుస్సేన్‌ బాష, శంకరయ్య, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని