logo

ఫ్లెక్సీల రగడ

ఆళ్లగడ్డలో ఫ్లెక్సీల రగడతో ఉద్రిక్తత నెలకొంది. పాత బస్టాండులో తెదేపా వర్గీయులు ఏర్పాటు చేసిన ‘సంసిద్ధం’ ఫ్లెక్సీపై భూమా కిశోర్‌రెడ్డి వర్గీయులు భాజపా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు శుక్రవారం యత్నించారు.

Published : 24 Feb 2024 02:10 IST

మొహరించిన పోలీసులు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డలో ఫ్లెక్సీల రగడతో ఉద్రిక్తత నెలకొంది. పాత బస్టాండులో తెదేపా వర్గీయులు ఏర్పాటు చేసిన ‘సంసిద్ధం’ ఫ్లెక్సీపై భూమా కిశోర్‌రెడ్డి వర్గీయులు భాజపా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు శుక్రవారం యత్నించారు. గతంలో ఉన్న భాజపా ఫ్లెక్సీలపై అఖిలప్రియ వర్గీయులు ‘సంసిద్ధం’ బ్యానర్లు ఏర్పాటు చేశారని వాటిని తొలగించి ‘ప్రజాపోరు’ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తామని కిశోర్‌ వర్గీయులు ముందుకు వచ్చారు. ఇది వివాదానికి దారి తీస్తుందని భావించిన పోలీసులు వారిని అడ్డుకొని ‘ప్రజాపోరు’ ఫ్లెక్సీని మరో చోట ఏర్పాటు చేయించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. భూమా అఖిలప్రియ ‘భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాత బస్టాండు మీదుగా వెళ్లారు. అదే ప్రాంతానికి భూమా కిశోర్‌రెడ్డి ర్యాలీగా వస్తుండటంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకరి తర్వాత ఒకరు వెళ్లేలా చర్యలు తీసుకుని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని