logo

రైతుల పోరాటానికి అండగా నిలవాలి

దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి దేశ ప్రజలంతా అండగా నిలవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దులు, ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ కార్యదర్శి మహమ్మద్‌ గౌస్‌ పిలుపునిచ్చారు.

Updated : 24 Feb 2024 03:53 IST

నిరసన వ్యక్తం చేస్తున్న సీఐటీయూ నాయకులు

రైతునగరం(నంద్యాల), న్యూస్‌టుడే: దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి దేశ ప్రజలంతా అండగా నిలవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దులు, ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ కార్యదర్శి మహమ్మద్‌ గౌస్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల గాంధీచౌక్‌లో కేంద్ర వైఖరిని నిరసిస్తూ సీఐటీయూ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం బాధాకరమన్నారు. లక్ష్మణ్‌, వెంకటలింగం, బాలవెంకట్‌, సుబ్బారావు, జైలాన్‌, వెంకటరావు, రానా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని