logo

పాద బాటలో పన్ను.. మంత్రికి ఫిర్యాదు

శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లే భక్తుల నుంచి అటవీ శాఖ పర్యావరణ నిర్వహణ ఛార్జీలు వసూలు చేయడంపై విశాఖపట్నానికి చెందిన సామాజిక కార్యకర్త గొనప అప్పన్న స్పందించారు.

Published : 25 Feb 2024 02:46 IST

ఆత్మకూరు, న్యూస్‌టుడే: శ్రీశైలానికి పాదయాత్రగా వెళ్లే భక్తుల నుంచి అటవీ శాఖ పర్యావరణ నిర్వహణ ఛార్జీలు వసూలు చేయడంపై విశాఖపట్నానికి చెందిన సామాజిక కార్యకర్త గొనప అప్పన్న స్పందించారు. డబ్బులు వసూలు చేయడంపై అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఏటా భ్రమరాంబ మల్లికార్జునుల దర్శనానికి నడిచి వెళ్తుంటారని అన్నారు. సిబ్బందికి జీతాలు సమకూర్చే నెపంతో పారిశుద్ధ్య పనుల కోసం డబ్బులు వసూలు చేయడంపై అభ్యంతరం తెలిపారు. ఇలాంటి ఘటనలు ఇంకేప్పుడు జరగకుండా చూడాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని