logo

అత్తారింటికి కన్నం వేసిన అల్లుడు

అత్తారింటికే కన్నం వేసిన అల్లుడు రూ.4.8 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన  ఆదోని పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో శనివారం చోటు చేసుకుంది. ఆదోని మూడో పట్టణ సీఐ నరసింహరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కె.కె.షాహీన్‌ అనే మహిళకు హీనా, షాహీనా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Updated : 25 Feb 2024 06:05 IST

రూ.4.80 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం

పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే : అత్తారింటికే కన్నం వేసిన అల్లుడు రూ.4.8 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన  ఆదోని పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో శనివారం చోటు చేసుకుంది. ఆదోని మూడో పట్టణ సీఐ నరసింహరాజు తెలిపిన వివరాల ప్రకారం.. కె.కె.షాహీన్‌ అనే మహిళకు హీనా, షాహీనా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. షాహీన్‌ ఈనెల 18వ తేదీన తన చిన్న కుమార్తె ఇంటికి వెళ్లి 22న తిరిగొచ్చారు. అప్పటికే బీరువాలో ఉన్న బంగారు, వెండి, నగదు అపహరణకు గురైనట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు షాహీన్‌ వాళ్ల పెద్ద అల్లుడే ఆ డబ్బును చోరీ చేసినట్లు గుర్తించారు. మహారాష్ట్రలో నివాసం ఉండే సయ్యద్‌ ఇసాక్‌ ఈనెల 21న ఆదోనికి వచ్చి స్థానిక రిలయన్స్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద నిద్ర పోయాడు. ఆ మరుసటి రోజు తెల్లవారుజామున బాధితురాలి ఇంట్లోకి వెళ్లి బీరువాలో ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. తన అత్త డబ్బులు, ఆభరణాలన్నీ చిన్న కూతురికే ఇచ్చేవారని.. ఆ కోపంతోనే దొంగతనానికి పాల్పడినట్లు నిందితుడు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు