logo

నిరుద్యోగులను మోసం చేసిన జగన్‌: బీవీ

యువత, నిరుద్యోగులను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.

Published : 25 Feb 2024 02:48 IST

బీవీని సన్మానిస్తున్న గ్రామస్థులు

మాచాపురం (నందవరం), న్యూస్‌టుడే: యువత, నిరుద్యోగులను మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని మాచాపురం గ్రామంలో బాబు స్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. డీఎస్సీ కోసం రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది నిరుద్యోగులు నాలుగున్నరేళ్లుగా ఎదురుచూస్తుండగా, కేవలం 6,100 పోస్టుల భర్తీకి ప్రకటన ఇవ్వడం దారుణమన్నారు. రాజకీయ కక్షలకు ప్రాధాన్యమిస్తూ యువత, నిరుద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. పల్లె నిద్రలో భాగంగా బీవీ జయనాగేశ్వరరెడ్డి మాచాపురం గ్రామంలో రాత్రి నిద్రించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు కాశీంవలి, బడేసాబ్‌ వలి, పెద్ద పీరాసాబ్‌, వెంకట్రాముడు, గురురాజా దేశాయ్‌, బండేగురుస్వామి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని