logo

ఆలూరులో అధికారానికి ఎదురుదెబ్బ

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే : ఆలూరు వైకాపాలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం ఆలూరు మండల కన్వీనరు వీరేశ్‌తో పాటు సచివాలయ కన్వీనర్లు రాజీనామా చేయగా, మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ నారాయణ పార్టీకి రాజీనామా చేశారు. పట్టణంలోని రోడ్లు, భవనాల అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన  మాట్లాడారు.

Published : 25 Feb 2024 02:59 IST

పార్టీ కండువాను తీసేసి మాట్లాడుతున్న మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ నారాయణ, ఇతర నాయకులు


మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ రాజీనామా: ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే : ఆలూరు వైకాపాలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. శుక్రవారం ఆలూరు మండల కన్వీనరు వీరేశ్‌తో పాటు సచివాలయ కన్వీనర్లు రాజీనామా చేయగా, మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ నారాయణ పార్టీకి రాజీనామా చేశారు. పట్టణంలోని రోడ్లు, భవనాల అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన  మాట్లాడారు. ఆలూరు వైకాపా సమన్వయకర్త విరూపాక్షికి రాజకీయాల గురించి ఏమీ తెలియదని, కేవలం ఆయన అగ్రవర్ణాల చేతిలో కీలుబొమ్మగా మారారని విమర్శించారు. మేము మంత్రి జయరాం అనుచరులమనే అక్కసుతోనే,  ఏ కార్యక్రమం జరిగినా విరూపాక్షి తమకు  సమాచారం ఇవ్వకుండా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి రామసుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య ఆలూరుకు వచ్చి ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపారు. ఎలాంటి ఆహ్వానం లేకపోవడం వల్ల ఇకపై తాము వైకాపాలో కొనసాగలేమని పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకనుంచి  మంత్రి జయరాం ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో జయరాం అనుచరుల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. చిప్పగిరి మండల కో కన్వీనరు హనుమన్న సైతం పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆలూరు మాజీ మండల కన్వీనరు వీరేశ్‌, ఆలూరు, మండల కో కన్వీనర్‌ హనుమయ్య, డేగులపాడు సర్పంచి నీలకంఠ, వీఆర్‌పీఎస్‌ తాలూకా అధ్యక్షుడు రామాంజనేయులు, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని