logo

రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌కు మాతృ వియోగం

కర్నూలుకు చెందిన భాజపా నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ మాతృ వియోగం చెందారు. ఆయన తల్లి టీజీ గౌరమ్మ (96) గత 15 రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు.

Published : 29 Feb 2024 02:18 IST

టీజీ గౌరమ్మ (పాతచిత్రం)

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: కర్నూలుకు చెందిన భాజపా నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ మాతృ వియోగం చెందారు. ఆయన తల్లి టీజీ గౌరమ్మ (96) గత 15 రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. నగరంలోని గౌరిగోపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆమెకు ఆరుగురు సంతానం.

నివాళి అర్పిస్తున్న కుటుంబసభ్యులు

నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా టీజీ వెంకటేశ్‌ మూడో సంతానం. టీజీ గౌరమ్మ మృతదేహాన్ని తెదేపా నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు కోట్ల సుజాతమ్మ, ఎస్వీ మోహన్‌రెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు కునిగిరి నీలకంఠ తదితరులు సందర్శించి నివాళి అర్పించారు. సాయంత్రం కర్నూలు నగరంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని