logo

బంగ్లా దంపతులు.. పర్యావరణ హితులు

వాతావరణ కాలుష్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్ని చైతన్యపర్చేందుకు సైకిల్‌యాత్ర చేపట్టారు బంగ్లాదేశ్‌కు చెందిన దంపతులు.

Published : 29 Feb 2024 05:57 IST

వాతావరణ కాలుష్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్ని చైతన్యపర్చేందుకు సైకిల్‌యాత్ర చేపట్టారు బంగ్లాదేశ్‌కు చెందిన దంపతులు. తమ యాత్రలో భాగంగా గత రెండు నెలలుగా మన దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బుధవారం వారి యాత్ర నంద్యాల పట్టణానికి చేరుకుంది. ఈసందర్భంగా టెక్కెలో వారు స్థానికులతో మాట్లాడుతూ.. శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల వినియోగం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతోందన్నారు. దీనివల్ల ఓజోన్‌ పొర దెబ్బతిని భావితరాల మనుగడకు తీవ్ర ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య రహిత వాహనాలు వాడటంతో పాటు పచ్చదనాన్ని పెంచేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

న్యూస్‌టుడే, నంద్యాల బొమ్మలసత్రం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని