logo

పల్లెలకు ఆర్థిక సంఘం నిధులు

పల్లెలకు కేంద్రం ఆర్థిక సంఘం ద్వారా నిధులు విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను తొలి విడత కింద కర్నూలు జిల్లాకు రూ.31.56 కోట్లు నిధులు విడుదలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజనాయుడు తెలిపారు.

Published : 29 Feb 2024 02:39 IST

కర్నూలు నగరం (జడ్పీ), న్యూస్‌టుడే: పల్లెలకు కేంద్రం ఆర్థిక సంఘం ద్వారా నిధులు విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను తొలి విడత కింద కర్నూలు జిల్లాకు రూ.31.56 కోట్లు నిధులు విడుదలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజనాయుడు తెలిపారు. జిల్లాలోని 25 మండలాల పరిధిలోని 484 గ్రామ పంచాయతీలకు బేసిక్‌ గ్రాంట్‌ కింద రూ.12.62 కోట్లు, టైడ్‌ గ్రాంట్‌ కింద రూ.18.54 కోట్లు విడుదలయ్యాయని, వాటిని పంచాయతీల ఖాతాలకు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్యం, మంచినీరు, విద్యుత్తు తదితర కనీస వసతుల కోసం ఖర్చు చేస్తామని, ఈ మేరకు పంచాయతీలకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. పంచాయతీలకు తాజాగా విడుదలైన నిధులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఈవోఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులకు మార్గదర్శకాలు విడుదల చేస్తున్నామన్నారు. పంచాయతీ పాలకవర్గాలు, కార్యదర్శులు సమన్వయంతో పనులు చేయించడంతోపాటు నిధులు వెచ్చించేందుకు సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించామన్నారు.  పంచాయతీల్లో చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు, కొత్త పనులకు ప్రతిపాదనలపై ఈవోఆర్డీలు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు