logo

స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ఆదోని పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో వివిధ సమస్యలపై సభ్యులు గట్టిగా నిలదీశారు.

Updated : 29 Feb 2024 13:58 IST

ఆదోని మార్కెట్ : ఆదోని పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో వివిధ సమస్యలపై సభ్యులు గట్టిగా నిలదీశారు. గురువారం ఛైర్‌పర్సన్‌ శాంత అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ మీటింగ్‌లో ముందుగా 24 అంశాల ఎజెండాపై చర్చించి ఆమోదించారు. అనంతరం సభ్యులు మాట్లాడుతూ.. పట్టణంలో తాగునీటి సమస్యలు మొదలుకొని వీధి దీపాల వరకు అన్నింటి ఇబ్బందులు ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదని అధికార పార్టీ సభ్యులు బాలాజీ యాదవ్, రఘునాథరెడ్డి, ఉస్మాన్ తెలిపారు. విద్యుత్ దీపాలు లేక చాలా కాలనీల్లో అంధకారం నెలకొంది అన్నారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు ఎదురుకాకుండా ముందస్తుగా జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని సభ్యులు సూచించారు. కుక్కల బెడద అధికమైందని రహదారులపై జనం తిరగలేకపోతున్నారని, రోజురోజుకు బాధితులు పెరుగుతున్నారని వీటి కట్టడికి చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరారు. సమావేశంలో వైస్ చైర్మన్ మహమ్మద్ గౌస్, సహాయ కమిషనర్ అనుపమ, ఇన్చార్జి మున్సిపల్ ఇంజనీర్ వెంకట చలపతి, డీఈలు, ఏఈలు, వివిధ విభాగ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని