logo

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ సభ్యుడు ఏరూరు శేఖర్, ఎంపిడీఓ నరేంద్ర కుమార్, తహసీల్దార్ చంద్రశేఖర్ అన్నారు.

Updated : 29 Feb 2024 13:59 IST

ఆలూరు: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ సభ్యుడు ఏరూరు శేఖర్, ఎంపిడీఓ నరేంద్ర కుమార్, తహసీల్దార్ చంద్రశేఖర్ అన్నారు. ఆలూరులోని 2వ సచివాలయంలో గురువారం జగనన్న ఇంటి స్థలాలకు సంబంధించి లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సొంతింటి కల నిజం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్థలం సమకూర్చి ఇళ్లను నిర్మించి ఇస్తుందన్నారు. కార్యక్రమంలో సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని