logo

మంటలు అంటుకుని గడ్డివాము దగ్ధం

హొళగుంద మండలం నెరణికి గ్రామంలో ప్రమాదవశాత్తు గడ్డివాములు కాలి బూడిదైన సంఘటన గురువారం చోటుచేసుకుంది.

Published : 29 Feb 2024 14:09 IST

హాలహర్వి: హొళగుంద మండలం నెరణికి గ్రామంలో ప్రమాదవశాత్తు గడ్డివాములు కాలి బూడిదైన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రైతులు గ్రామ శివారులో గడ్డివాములు ఏర్పాటు చేసుకున్నారు. అయితే వాటికి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది . దీంతో 7 గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వచ్చి మంటలు అదుపు చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 4లక్షలు ఆస్తి నష్టం వాటిల్లింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని