logo

సర్వజన ఆసుపత్రిలో చోరీ యత్నం

నంద్యాల సర్వజన ఆసుపత్రిలోని సత్వర చికిత్సా కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి చోరీకి యత్నించారు. గురువారం ఉదయం సత్వర చికిత్స కేంద్రాన్ని తెరిచిన సిబ్బంది బాత్‌రూమ్‌లో కిటికీ అద్దాలు పగిలిపోయినట్లు గుర్తించారు.

Published : 01 Mar 2024 02:21 IST

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే : నంద్యాల సర్వజన ఆసుపత్రిలోని సత్వర చికిత్సా కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి చోరీకి యత్నించారు. గురువారం ఉదయం సత్వర చికిత్స కేంద్రాన్ని తెరిచిన సిబ్బంది బాత్‌రూమ్‌లో కిటికీ అద్దాలు పగిలిపోయినట్లు గుర్తించారు. ఈ కిటికీ ద్వారా దొంగలు బాత్‌రూమ్‌లోకి ప్రవేశించిన విషయం వెలుగుచూసింది. దీని తలుపులకు బయటి నుంచి గడియపెట్టడంతో ఆసుపత్రి విభాగాల్లోకి ప్రవేశించే అవకాశం లేకుండాపోయింది. దీంతో మళ్లీ అదే కిటికీ నుంచి వెళ్లిపోయారు. జిల్లా సత్వర చికిత్స కేంద్రంలో రూ.80 లక్షల విలువైన అత్యాధునిక వినికిడి, కంటి పరీక్షలు, తదితర యంత్రాలు, వ్యాయామ పరికరాలు ఉన్నాయి. వాటిని ఎత్తుకెళ్లేందుకే దొంగలు ప్రయత్నించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని