logo

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శివయ్య డిమాండ్‌్ చేశారు.

Published : 01 Mar 2024 02:30 IST

తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న ఏపీటీఎఫ్‌ నాయకులు

నంద్యాల గ్రామీణం, న్యూస్‌టుడే : ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శివయ్య డిమాండ్‌్ చేశారు. ఏపీటీఎఫ్‌ నాయకులతో కలిసి నంద్యాల తహసీల్దారు కార్యాలయం ఎదుట గురువారం వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 27న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జేఏసీ అర్ధంతరంగా వాయిదా వేయడాన్ని ఏపీటీఎఫ్‌ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భాస్కర్‌రెడ్డి, వీరేశ్వరరెడ్డి, రాజ్‌కుమార్‌్, దస్తగిరి బాషా, రాములమ్మ, శైలజ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు