logo

క్రీడల్లో రాణించి... పతకాలతో మురిపించి

పల్లెల్లోని బాలికలు క్రీడలపై ఆసక్తితో పతకాలను దక్కించుకుంటున్నారు. ఒకవైపు చదువులో రాణిస్తూ...మరోవైపు ఆటల్లోనూ సత్తా చాటుతూ బహుమతులు సాధిస్తున్నారు.

Published : 01 Mar 2024 02:32 IST

న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ గ్రామీణం

పల్లెల్లోని బాలికలు క్రీడలపై ఆసక్తితో పతకాలను దక్కించుకుంటున్నారు. ఒకవైపు చదువులో రాణిస్తూ...మరోవైపు ఆటల్లోనూ సత్తా చాటుతూ బహుమతులు సాధిస్తున్నారు. ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులు రోప్‌ స్కిప్పింగ్‌లో ప్రతిభ చూపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.


బంగారు పతకమే లక్ష్యం : రాణి

రుద్రవరం మండలం చందలూరుకు చెందిన సురేష్‌, శాంతకుమారిల కుమార్తె రాణి కస్తూర్బాలో ఏడో తరగతి చదువుతోంది. వ్యాయామ ఉపాధ్యాయిని శ్రీలత వద్ద తర్ఫీదు పొంది రోప్‌ స్కిప్పింగ్‌లో పతకాలను సాధిస్తోంది. గతేడాది జులైలో నంద్యాలలో జరిగిన జిల్లాస్థాయి రోప్‌ స్కిప్పింగ్‌లో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. అదే నెలలో కర్నూలులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్‌-12 సైక్లింగ్‌ విభాగంలో మెరుగైన ప్రదర్శన ద్వారా మొదటి స్థానంలో నిలిచింది. స్వర్ణ పతకం సాధించి ప్రశంసలు అందుకొంది. జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నట్లు చెబుతోంది.


జాతీయ స్థాయిలో ఆడాలని...: అశ్విని

ఆళ్లగడ్డ మండలం కొండంపల్లెకు చెందిన సుబ్బారావు, సావిత్రి దంపతుల కుమార్తె అశ్విని కసూర్బాలో ఎనిమిదో తరగతి చదువుతోంది. రోప్‌ స్కిప్పింగ్‌లో తర్ఫీదు పొంది గతేడాది జులైలో నంద్యాలలో జరిగిన జిల్లాస్థాయి రోప్‌ స్కిప్పింగ్‌ పోటీల్లో అండర్‌-14 విభాగంలో ఆడి ఉత్తమ ప్రదర్శన ఇచ్చింది. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడంతో మరింత కసరత్తు చేసి పట్టు సాధించింది. జులైలో కర్నూలులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో మెరుగైన ఆట తీరుతో రెండోస్థానం కైవసం చేసుకొంది. రజతాన్ని సాధించి ప్రశంసాపత్రం అందుకొంది. జాతీయస్థాయిలో ఆడి పతకాలు సాధించాలని సాధన చేస్తున్నట్లు చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని