logo

తడకనపల్లెను తవ్వేశారు

Published : 01 Mar 2024 02:41 IST

తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో ఎర్రమట్టి తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి టి.రాజశేఖర్‌ తెలిపారు. తడకనపల్లెలోని 336 సర్వే నంబరులో గురువారం తనిఖీలు చేపట్టామని.. 330 క్యూబిక్‌ మీటర్ల ఎర్రమట్టి తవ్వకాలు జరిపి అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించామన్నారు. సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కర్నూలు, ఆత్మకూరు హైవే రోడ్డు పనులకు సంబంధించి కర్నూలు మండల పరిధిలో నూతనపల్లె, పూడూరు, దిగువపాడు ప్రాంతంలో గ్రావెల్‌ తవ్వకాలకు గతంలో అనుమతులు ఇచ్చిన ప్రాంతాల్లో పరిశీలన చేపట్టామని తెలిపారు. గతంలో ఇచ్చిన అనుమతుల కంటే ఎక్కువ తవ్వకాలు జరిపారా? లేదా? అన్నదానిపై కొలతలు వేయిస్తున్నామన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌ ఏడీ బైరాగి నాయుడు, రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ మురహరి, టెక్నికల్‌ అసిస్టెంట్‌ దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని