logo

అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు

వచ్చే ఎన్నికల్లో  ఓటర్ల జాబితా, ఓటర్‌ స్లిప్పుల పంపిణీ  తదితర బాధ్యతలను బీఎల్వోలు  చూసుకోవాలని జిల్లా కలెక్టర్ సృజన అన్నారు.

Published : 03 Apr 2024 11:14 IST

ఎమ్మిగనూరు: వచ్చే ఎన్నికల్లో  ఓటర్ల జాబితా, ఓటర్‌ స్లిప్పుల పంపిణీ  తదితర బాధ్యతలను బీఎల్వోలు  చూసుకోవాలని జిల్లా కలెక్టర్ సృజన అన్నారు. బుధవారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని  బీఎల్వోలు , సెక్యూరిటీ అధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ  తయారుచేసిన ఓటర్ల జాబితాలో  ఎలాంటి తప్పులున్నా అందుకు బాధ్యులు బీఎల్వోలు అధికారులే అని  తెలిపారు.  ఏప్రిల్ 25వ తేదీ వరకు  కొత్త ఓటర్లు ఓటు నమోదు చేసుకోవచ్చని  వివరించారు. ఓటర్ స్లిప్పులను  మూడు రోజులు ముందుగానే పూర్తి చేయాలన్నారు. బీఎల్వోలు,  సెక్టార్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే  కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్వో  చిరంజీవి, ఈ ఆర్ ఓ  శేషారెడ్డి, డీఎస్పీ  సీతారామయ్య  తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని