logo

ఓటమి భయంతోనే తప్పుడు ప్రచారాలు

రాష్ట్రంలో వైకాపా చిరునామా గల్లంతైందని.. ఓడిపోతాననే నిర్ణయానికి జగన్‌ వచ్చారని తెదేపా రాష్ట ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

Published : 13 Apr 2024 02:27 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా చిరునామా గల్లంతైందని.. ఓడిపోతాననే నిర్ణయానికి జగన్‌ వచ్చారని తెదేపా రాష్ట ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన శుక్రవారం కర్నూలులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వైకాపా 120 సీట్లతో అధికారంలోకి వస్తుందంటూ వాట్సప్‌ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈటీవీ విశ్వసనీయత దెబ్బతీసేలా ఆ పేరుతో వైకాపా పేటీఎం బ్యాచ్‌లు నకిలీ వీడియోలు సృష్టించి అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. జగన్‌ ఒకసారి ముఖ్యమంత్రి అయితేనే ప్రతి ఒక్కరిపై రూ.2 లక్షల వరకు అప్పుల భారం మోపారని, రాష్ట్రాన్ని దివాలా స్థితికి తెచ్చారని జగన్‌పై ధ్వజమెత్తారు. మోసం చేయడంలో జగన్‌ దిట్ట అని, వివేకా హత్యలో చంద్రబాబును ఇరికించాలని కుట్ర పన్నారని, ఇలాంటి మోసగాడిని ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నార న్నారు.  రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే చంద్రబాబుకు ఓటేసి తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని