logo

ఇంటర్‌లో అమ్మాయిల సత్తా

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు..ప్రైవేటు కళాశాలలో చదివిన విద్యార్థులు ‘మార్కు’ చూపగా.. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారు వెనుకబడ్డారు.

Published : 13 Apr 2024 02:42 IST

ప్రథమలో 68 శాతం, ద్వితీయలో 76 శాతం ఉత్తీర్ణత

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటారు..ప్రైవేటు కళాశాలలో చదివిన విద్యార్థులు ‘మార్కు’ చూపగా.. ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారు వెనుకబడ్డారు. 76 శాతంతో కర్నూలు 12వ స్థానంలో నిలవగా, నంద్యాల జిల్లా 70 శాతంతో 19వ స్థానంలో నిలిచింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 43 ప్రభుత్వ, 113 ప్రైవేటు కళాశాలతోపాటు ఎయిడెడ్‌, ఆదర్శ, కేజీబీవీ, ఏపీ రెసిడెన్షియల్‌, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌, ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలు 112 కలిపి 268 ఉన్నాయి. మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు జరిగాయి.

ఈ ఏడాది

ప్రథమ సంత్సరానికి సంబంధించి కర్నూలు జిల్లాలో 19,818 మంది విద్యార్థులు హాజరు కాగా 13,394 మంది ఉత్తీర్ణులయ్యారు. నంద్యాలలో 12,022 మందికి 7,102 మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి కర్నూలులో 17,294 మంది పరీక్షలు రాయగా 13,210 మంది ఉత్తీర్ణులయ్యారు. నంద్యాలలో 9,165 మంది పరీక్షకు హాజరుకాగా 6,429 మంది గట్టెక్కారు.

గతేడాది

గతేడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫలితాలు పరిశీలిస్తే ఇంటర్‌ మొదటి ఏడాదిలో 56 శాతం, రెండో ఏడాది 66 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొదటి ఏడాదిలో 29,772 మంది పరీక్ష రాయగా 16,638 మంది, రెండో ఏడాదిలో 26,980 మందికిగాను 17,719 మంది పాసయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని